- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాల్ దర్వాజా బోనాలు.. ఆ పనులు వెంటనే చేపట్టండి
<p>దిశ, చార్మినార్ : తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవాలకు అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఆలయ చైర్మన్ కె.వెంకటేష్ కోరారు. ఆషాడ మాస బోనాల జాతరను పురస్కరించుకుని శుక్రవారం జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ఆలయం సమీపంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదనన్నారు. 2019 […]</p>

దిశ, చార్మినార్ : తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవాలకు అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఆలయ చైర్మన్ కె.వెంకటేష్ కోరారు. ఆషాడ మాస బోనాల జాతరను పురస్కరించుకుని శుక్రవారం జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు.
గత రెండు సంవత్సరాలుగా ఆలయం సమీపంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదనన్నారు. 2019 జూన్ నెలలో జరిగిన బోనాల సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి పనులు తప్ప ఇంతవరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే నెలలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలలోపు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.విష్ణు గౌడ్, కోశాధికారి జి.అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






