జలదిగ్భందంలో 650 ఇళ్లు

by  |
జలదిగ్భందంలో 650 ఇళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపం దాల్చుతోంది. గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చేరి చెరువు నిండి కాలనీల్లో చేరుతున్నాయి. దీంతో స్థానిక ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా నీటమునిగింది. ఈ క్రమంలో 650 ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక నగర్ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సాగర్ తూములు తెరిచేందుకు అధికారులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న సాంకేతిక బృందాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి అక్కడికి చేరుకున్నాయి.



Next Story

Most Viewed