- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ గోల్డ్ స్కాం.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : కేరళ గోల్డ్ స్కాంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితుల్లో ఒకరైన జయఘోష్ శుక్రవారం ఆత్మహత్యయత్నం చేశాడు. ఇతను యూఏఈ కాన్సులేట్‌లో గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించేవాడు. ఈ స్కాంలో ముఖ్య సూత్రదారి అయిన స్వప్న జయఘోష్‌తో రెగ్యూలర్ గా ఫోన్ మాట్లాడినట్లు సమాచారం. ఆమె కాల్ రికార్డులను తనిఖీ చేసిన NIA అధికారులకు గన్‌మెన్ జయఘోష్ నెంబర్ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు ఈ గోల్డ్ స్కాంకు ఎలాంటి సంబంధం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కేరళ గోల్డ్ స్కాంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితుల్లో ఒకరైన జయఘోష్ శుక్రవారం ఆత్మహత్యయత్నం చేశాడు. ఇతను యూఏఈ కాన్సులేట్‌లో గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించేవాడు. ఈ స్కాంలో ముఖ్య సూత్రదారి అయిన స్వప్న జయఘోష్‌తో రెగ్యూలర్ గా ఫోన్ మాట్లాడినట్లు సమాచారం. ఆమె కాల్ రికార్డులను తనిఖీ చేసిన NIA అధికారులకు గన్‌మెన్ జయఘోష్ నెంబర్ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు ఈ గోల్డ్ స్కాంకు ఎలాంటి సంబంధం లేదని వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జయఘోష్ ఆత్మహత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నిందితులను NIA అరెస్టు చేసి విచారిస్తోంది.
Next Story






