తెలంగాణకు మరో ముప్పు.. టెస్టులు తప్పనిసరా..?

by  |
Typhoid tests
X

దిశ, తెలంగాణ బ్యూరో : జ్వరం, వాంతులు, నీరసం ఉన్నోళ్లందరికీ టైఫాయిడ్​ టెస్టులను తప్పనిసరిగా చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. విస్తారంగా కురిసిన వానల వలన నీరు కలుషితమై టైఫాయిడ్, వైరల్​ఫీవర్లు పెరిగే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీజనల్​వ్యాధులపై అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీహెచ్​ డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం కరోనా తగ్గిందని, సీజనల్​వ్యాధులను కూడా నియంత్రించేందుకు మరిన్ని రోజులు శ్రమించాలని కోరారు. ముఖ్యంగా గ్రామాల కంటే అర్బన్​ ప్రాంతాల్లో ఫోకస్​పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

గత కొన్ని రోజుల నుంచి సీజనల్​ జ్వరాలు అర్బన్‌లోనే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయన్నారు. దీంతో ప్రత్యేక క్యాంపులు పెట్టి టైఫాయిడ్, మలేరియా, డెంగీతో పాటు విషజ్వరాల శాంపిల్స్‌ను​సేకరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఇప్పటికే నిర్ధారణ కిట్లను కూడా ప్రతీ పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచామన్నారు. శాంపిల్​సంఖ్య పెరిగితే తెలంగాణ డయాగ్నస్టిక్​ కేంద్రాలకు పంపించాలన్నారు.

ఇదిలా ఉండగా రాష్ర్ట వ్యాప్తంగా సీజనల్​వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత రెండు నెలల నుంచి డెంగీ తీవ్రత కొనసాగుతుండగా, వారం రోజుల నుంచి టైఫాయిడ్​ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రతి రోజు వేడి ఆహారం, గోరువెచ్చని నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నది. సీజనల్​వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, లక్షణాలున్నోళ్లంతా వెంటనే వ్యాధి నిర్ధారణకు వెళ్లాలని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed