- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 6300 అడుగల ఎత్తు నుంచి పడిపోయిన మహిళలు..
దిశ, వెబ్‌డెస్క్ : ఒక్కోసారి వినోదం కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయి. పలు సందర్భాల్లో సరదాగా చేసిన పనులకు ప్రాణాలు కోల్పోయిన విషయాలు చాలానే చూసి ఉంటాం. తాజాగా ఓ సరదా రైడ్ ఇద్దరు మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. రష్యాలోని సులక్ కాన్యాన్ ప్రాంతంలోని ఓ కొండ అంచున 6300 అడుగల ఎత్తులో.. ఓ ‘స్వింగ్ రైడ్’ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో దాని మీద ఇద్దరు మహిళలు కూర్చోని సరదాగా రైడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. వాళ్లు కూర్చున్న తర్వాత వెనక నుంచి ఓ వ్యక్తి తోయడం మొదలుపెట్టాడు. కొంత సేపు ఆ రైడ్‌ను ఎంజాయ్చేసిన ఇద్దరు మహిళలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆ స్వింగ్ చైన్ ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో, ఆ మహిళలు అక్కడి నుంచి కిందపడిపోయారు. అయితే, అదృష్టవశాత్తు వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంత పర్యాటకశాఖ స్పందించింది.
స్వింగ్రైడ్లో.. భద్రతాపరమైన ప్రమాణాలు లోపించిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. ఈ ప్రమాద ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia.
Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches.
Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx— UncleRandom (@Random_Uncle_UK) July 14, 2021