వాహనాల అమ్మకాలు తగ్గొచ్చు : ఇక్రా

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-21 10:23:31  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల వాల్యూమ్‌లలో 16-18 శాతం సంకోచం ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి, ఆర్థిక అనిశ్చితుల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 16-18 శాతం వరకూ తగ్గుతాయని ఇక్రా అంచనా వేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగం, డిమాండ్ తగ్గుతాయని భావిస్తున్నట్టు, గ్రామీణ మార్కెట్లలో కొంత పెరుగుదల ఊరట కలిగిస్తుందని పేర్కొంది. &#8216;ప్రభుత్వ చర్యలు, సానుకూల [&hellip;]</p>

వాహనాల అమ్మకాలు తగ్గొచ్చు : ఇక్రా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల వాల్యూమ్‌లలో 16-18 శాతం సంకోచం ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి, ఆర్థిక అనిశ్చితుల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 16-18 శాతం వరకూ తగ్గుతాయని ఇక్రా అంచనా వేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగం, డిమాండ్ తగ్గుతాయని భావిస్తున్నట్టు, గ్రామీణ మార్కెట్లలో కొంత పెరుగుదల ఊరట కలిగిస్తుందని పేర్కొంది.

‘ప్రభుత్వ చర్యలు, సానుకూల వాతావరణ పరిస్థితులు, కొవిడ్-19 ప్రభావం తక్కువగా ఉండటంతో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతున్నట్టు ఇక్రా అభిప్రాయపడింది. అంతేకాకుండా, పట్టణ ప్రాంతాల్లో రవాణాలో వచ్చిన మార్పుల కారణంగా డిమాండ్ మెరుగ్గానే ఉంటోందని, ఆగష్టులో 22 శాతం, సెప్టెంబర్ అమ్మకాల్లో 19 శాతం వృద్ధి నమోదు అయినట్టు, వార్షిక ప్రాతిపదికన 3 శాతం, టోకు వాల్యూమ్‌లలో 12 శాతం వృద్ధి నమోదైందని’ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషార్ దేవన్ చెప్పారు. పండుగ సీజన్ సందర్భంగా ఒరిజినల్ పరికరాల తయారీదారుల సరఫరా బలంగా ఉన్నప్పటికీ, రిటైల్ వాల్యూమ్‌లలో వృద్ధి మందగించిందని ఆయన వివరించారు. మొత్తంగా, పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌లో రిటైల్ వాల్యూమ్‌లలో 13 శాతం వృద్ధి సాధించినప్పటికీ, వార్షిక ప్రాతిపదికన సంకోచం నమోదవచ్చని శంషార్ పేర్కొన్నారు.

Next Story