- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్మశానం గోల.. మహిళ చనిపోయి నాలుగురోజులైనా!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : పొలం కోసం, దాని హద్దుల కోసం జనాలు కొట్టుకోవడం మనం చూసే ఉంటాం. కానీ, విచిత్రంగా శ్మశానం కోసం రెండు ఊర్లు పంచాయితీకి దిగాయి. అటు వైపు, ఇటు వైపు ఎవరు మరణించిన అంత్యక్రియలు జరగకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెట్టూరుగూడ, మెట్టూరు గ్రామాల మధ్య వైరాన్ని తెచ్చిపెట్టింది. అంతకుముందు మెట్టూరుగూడకు చెందిన మహాలక్ష్మి అనే మహిళ అంత్యక్రియలపై ఈ వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో ఆ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పొలం కోసం, దాని హద్దుల కోసం జనాలు కొట్టుకోవడం మనం చూసే ఉంటాం. కానీ, విచిత్రంగా శ్మశానం కోసం రెండు ఊర్లు పంచాయితీకి దిగాయి. అటు వైపు, ఇటు వైపు ఎవరు మరణించిన అంత్యక్రియలు జరగకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెట్టూరుగూడ, మెట్టూరు గ్రామాల మధ్య వైరాన్ని తెచ్చిపెట్టింది.
అంతకుముందు మెట్టూరుగూడకు చెందిన మహాలక్ష్మి అనే మహిళ అంత్యక్రియలపై ఈ వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో ఆ మహిళ చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా.. నేటికి అంత్యక్రియలు పూర్తి కాలేదు. దీంతో సమీపంలోని పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోనే మహిళ మృతదేహాన్ని భద్రపరిచారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వెంటనే ఘటనా స్థలికి వెళ్లి ఇరువురు గ్రామపెద్దలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






