- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాను జయించిన అక్క.. స్టెప్పులతో దుమ్మురేపిన చెల్లి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈరోజుల్లో కరోనా బారిన పడి చికిత్స అనంతరం నెగెటివ్ రావడంతో కొందరు ప్రపంచాన్నే జయించినంత ఫీలవుతున్నారు.ఈ మధ్యకాలంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కొందరు సైతం క్వారంటైన్ వార్డులో డాన్సులెస్తే.. కరోనా బారిన పడి చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన అక్కను చూసి ఓ చెల్లి వీర స్టెప్పులేసింది. ఈ ఘటన పుణేలో వెలుగుచూసింది. అంతకుమందు వీరింట్లో అక్కకు పాజిటివ్ రాగానే ఆ వీధంతా రెడ్‌జోన్ లోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆ యువతి కరోనా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఈరోజుల్లో కరోనా బారిన పడి చికిత్స అనంతరం నెగెటివ్ రావడంతో కొందరు ప్రపంచాన్నే జయించినంత ఫీలవుతున్నారు.ఈ మధ్యకాలంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కొందరు సైతం క్వారంటైన్ వార్డులో డాన్సులెస్తే.. కరోనా బారిన పడి చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన అక్కను చూసి ఓ చెల్లి వీర స్టెప్పులేసింది. ఈ ఘటన పుణేలో వెలుగుచూసింది. అంతకుమందు వీరింట్లో అక్కకు పాజిటివ్ రాగానే ఆ వీధంతా రెడ్‌జోన్ లోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆ యువతి కరోనా నుంచి కోలుకోవడంతో అధికారులు పంపించారు.
https://twitter.com/Andfornation/status/1284761183015391232?s=20
అయితే, తన అక్క ఇంటికి రావడాన్ని దూరం నుంచే గమనించిన చెల్లెలు ఓ హిందీ పాటకు సరిగ్గా సరిపోయే స్టెప్పులు వేస్తూ తన సోదరికి ఎదురెళ్లి స్వాగతం పలికింది. చెల్లెలి సంతోషం చూసిన అక్క కూడా కాలు కదిపి చిందులేసింది. మొత్తంగా ఈ అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






