- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపు కాచి.. ఇద్దరు పోలీసులను కొట్టి చంపారు
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఇద్దరు పోలీసులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఇది మావోయిస్టుల ఘాతుకమా లేక వ్యక్తిగత కక్షలు ఇందుకు దారితీశాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న దంతెవాడ జిల్లా నేతల్‌నార్‌కి చెందిన పూనెం హరమ, జేగురుగొండకి చెందిన ధనిరామ్ కశ్యప్‌లు కలిసి ఆసుపత్రికి వెళ్ళి తిరిగి తమ ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వక్తులు వారిని ఆపి కొట్టి పదునైన ఆయుధంతో […]</p>

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఇద్దరు పోలీసులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఇది మావోయిస్టుల ఘాతుకమా లేక వ్యక్తిగత కక్షలు ఇందుకు దారితీశాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న దంతెవాడ జిల్లా నేతల్‌నార్‌కి చెందిన పూనెం హరమ, జేగురుగొండకి చెందిన ధనిరామ్ కశ్యప్‌లు కలిసి ఆసుపత్రికి వెళ్ళి తిరిగి తమ ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వక్తులు వారిని ఆపి కొట్టి పదునైన ఆయుధంతో హత్యచేసి మృతదేహాలను రోడ్డుపైనే పడేసి వెళ్ళారు.
ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో బెజ్జి సీఆర్‌పీఎఫ్ క్యాంపుకి చేరువలోనే జరిగింది. సుక్మా ఎస్‌పి కెఎల్ ధృవ్ ఈ జంట హత్యలను ధృవీకరించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.






