- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం లారీని బైక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి అక్కడికక్కడే ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మృతులు నారాయణరెడ్డి, రోషిరెడ్డిగా గుర్తించారు. బాట సుంకలమ్మ దగ్గర శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాడిపత్రి నుంచి వస్తున్న లారీని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ కూడా పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం లారీని బైక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి అక్కడికక్కడే ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మృతులు నారాయణరెడ్డి, రోషిరెడ్డిగా గుర్తించారు. బాట సుంకలమ్మ దగ్గర శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాడిపత్రి నుంచి వస్తున్న లారీని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ కూడా పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






