అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

by Batti.Sumithra |

<p>దిశ, ములకలపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గంగారాం అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన హరి, ఇదే మండలం చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన కాసాని సాయి లక్ష్మీ.. పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గంగారాం అటవీ ప్రాంతంలో వీరి బైకుకు కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో వారి బైక్ అదుపు తప్పి వారిద్దరూ కిందపడిపోయారు. ఈ [&hellip;]</p>

అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, ములకలపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గంగారాం అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన హరి, ఇదే మండలం చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన కాసాని సాయి లక్ష్మీ.. పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో గంగారాం అటవీ ప్రాంతంలో వీరి బైకుకు కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో వారి బైక్ అదుపు తప్పి వారిద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రచన్నగూడెం సర్పంచ్ కోర్స గణపతి, నాయకులు పోతుగంటి లక్ష్మణ్, కుంజా కృష్ణ క్షతగాత్రులను లేపి అంబులెన్స్‌ సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story