కొంగల జలపాతంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు

by Batti.Sumithra |

<p>దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల జలపాతం దుస్స లోది జలపాతంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన మునిగల నరేష్ (24) సింగరేణి ఉద్యోగి తన స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా జలపాతం సందర్శనకు వచ్చారు. కొంగల జలపాతంలో స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ జలపాతం లోయలోకి దూకి ఈత కొడుతుండగా [&hellip;]</p>

కొంగల జలపాతంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు
X

దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల జలపాతం దుస్స లోది జలపాతంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన మునిగల నరేష్ (24) సింగరేణి ఉద్యోగి తన స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా జలపాతం సందర్శనకు వచ్చారు. కొంగల జలపాతంలో స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ జలపాతం లోయలోకి దూకి ఈత కొడుతుండగా లోయలో గల్లంతయ్యాడు.

నరేష్ ఆచూకీ కోసం గాలిస్తుండగా నరేష్ ను రక్షించడానికి లోయలోకి దిగిన రంగారెడ్డి జిల్లా కొండాపురం మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న రవి కుమార్ చారి (30) కూడా కాన రాలేదని వాజేడు ఎస్ఐ తిరుపతి రావు తెలిపారు. స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా గడిపిన క్షణాల్లో గల్లంతు కావడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడిపే క్షణమే కానరాని లోకాలకు తీసుకువెళ్ళడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story