- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతా మా ఇష్టం.. మూడు పువ్వులు ఆరు కాయలుగా ‘ఇసుకాసురుల’ దందా
by Batti.Sumithra |
<p>దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలో ఇసుకాసురులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మా ఇసుక దందాకు అనుమతులు లేవు.. ఏమీ లేవు, అంతా మా ఇష్టం.. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం నుంచి ఖమ్మంకు ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను మండలంలోని ఓసీ 4 చెక్ పోస్ట్ వద్ద మణుగూరు సీఐ భాను ప్రకాష్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుకున్న లారీలకు ఎలాంటి అనుమతులు […]</p>

X
దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలో ఇసుకాసురులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మా ఇసుక దందాకు అనుమతులు లేవు.. ఏమీ లేవు, అంతా మా ఇష్టం.. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం నుంచి ఖమ్మంకు ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను మండలంలోని ఓసీ 4 చెక్ పోస్ట్ వద్ద మణుగూరు సీఐ భాను ప్రకాష్ పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుకున్న లారీలకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. లారీల యజమానులు వడ్లుముడి నరేంద్రబాబు, బోడా రామణలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. లారీల వివరాలు AP16TC 2297,TS04UB 9442 వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని సీఐ హెచ్చరించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
Next Story






