చెరువులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-26 07:51:58  IST  )

<p>దిశ, పటాన్‌చెరు: బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐలపూర్ తండా సమీపంలో చోటు చేసుకుంది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ చిన్న తండాలో నలుగురు యువతులు (వలస కూలీలు) నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలోనే బట్టలు ఉతకడానికి దగ్గరలోని చెరువులోకి వెళ్లారు. ఆ తర్వాత చెరువులో స్నానం చేసే ప్రయత్నంలో నీటిలో మునిగి మృతి చెందారు. మృతులు [&hellip;]</p>

చెరువులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి
X

దిశ, పటాన్‌చెరు: బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐలపూర్ తండా సమీపంలో చోటు చేసుకుంది.

అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ చిన్న తండాలో నలుగురు యువతులు (వలస కూలీలు) నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలోనే బట్టలు ఉతకడానికి దగ్గరలోని చెరువులోకి వెళ్లారు. ఆ తర్వాత చెరువులో స్నానం చేసే ప్రయత్నంలో నీటిలో మునిగి మృతి చెందారు. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన వలస కూలీలు చిట్టి(20), వరలక్ష్మీగా (19)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story