- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మా కంపెనీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..
<p>దిశ, పటాన్ చెరు : గ్లాండ్ ఫార్మా పరిశ్రమ బస్సు ఢీకొని ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంకు వద్ద మెట్రో వాటర్ వర్క్స్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో పైప్ లైన్ పనులు ముగించిన […]</p>

దిశ, పటాన్ చెరు : గ్లాండ్ ఫార్మా పరిశ్రమ బస్సు ఢీకొని ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంకు వద్ద మెట్రో వాటర్ వర్క్స్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో పైప్ లైన్ పనులు ముగించిన తర్వాత రాజ్ కుమార్, అర్జున్ అనే ఇద్దరు కూలీలు జనరేటర్‌ను పక్కకు తొలగిస్తున్నారు.
ఆ సమయంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమకు చెందిన శ్రీ సాయి గణేష్ ట్రావెల్స్ బస్సు గండిమైసమ్మ దగ్గర కార్మికులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా వేగంగా వచ్చి జనరేటర్‌ను తొలిగిస్తున్న వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే మృతులను పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.






