- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం మిగిల్చిన బావి
<p>దిశ, పాలేరు: దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని మంగళగూడెం రెవెన్యూ శివారు గ్రామమైన డోర్నకల్ మండలం వెన్నారం గ్రామాల మధ్యలో కోతుల వాగులో సోమవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని హరిశ్చంద్రుడు తండాకు చెందిన గుగులోతు త్రిష(14) , గుగులోతు సింధు(12) పశువులు మేపడానికి ఇరువురు మంగళగూడెం శివారుకు వెళ్లారు. మధ్యాహ్నం వేళ దాహం వేయడంతో కోతుల […]</p>

దిశ, పాలేరు: దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని మంగళగూడెం రెవెన్యూ శివారు గ్రామమైన డోర్నకల్ మండలం వెన్నారం గ్రామాల మధ్యలో కోతుల వాగులో సోమవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని హరిశ్చంద్రుడు తండాకు చెందిన గుగులోతు త్రిష(14) , గుగులోతు సింధు(12) పశువులు మేపడానికి ఇరువురు మంగళగూడెం శివారుకు వెళ్లారు.
మధ్యాహ్నం వేళ దాహం వేయడంతో కోతుల వాగు సమీపంలోని బావిలోకి దిగి నీట మునిగిపోయారు. స్థానికులు ఆలస్యంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సమీపంలోని వెన్నారం, మంగళ గూడెం గ్రామ ప్రజలు వచ్చి మృతదేహాలను గాలించి వెలికి తీశారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.






