జీవాలకోసం వెళ్లి ప్రాణాలు విడిచారు

by Sridhar Babu |   (  Updated:2020-10-10 11:24:11  IST  )

<p>దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెలకాపరులు మృతి చెందారు. 30 గొర్లు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ఓడేడు శివారులో శనివారం సాయంత్రం ఈఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే&#8230; జిల్లాలో‌ సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో గొర్రెలతో సహ చెట్ల కింద తల దాచుకునేందుకు కొమురయ్య, నరేశ్ అనే గొర్రెల కాపరులు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడి ఇద్దరు [&hellip;]</p>

జీవాలకోసం వెళ్లి ప్రాణాలు విడిచారు
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెలకాపరులు మృతి చెందారు. 30 గొర్లు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ఓడేడు శివారులో శనివారం సాయంత్రం ఈఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… జిల్లాలో‌ సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో గొర్రెలతో సహ చెట్ల కింద తల దాచుకునేందుకు కొమురయ్య, నరేశ్ అనే గొర్రెల కాపరులు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.

Next Story