రెండ్రోజులు సెలవు..

27

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (14, 15 తేదీలు) హైదారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది.

అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, నగరంలో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.