ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన చర్చి నిర్మాణం.. ఏం జరిగిందంటే.?

by Shyam |   (  Updated:2021-09-05 05:43:47  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కొరకు తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మృతుల్లో చర్చి ఫాదర్ దిలీప్ కుమారుడు హనిల్ సన్(4), మరో బాలిక జయశ్రీ అలియాస్ గ్రేసి(4)గా గుర్తించారు. చర్చి నిర్మాణం కోసం పునాదులు తీయగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆ గుంతలు నీటితో నిండిపోయాయి. అక్కడ ఆడుకున్న [&hellip;]</p>

ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన చర్చి నిర్మాణం.. ఏం జరిగిందంటే.?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కొరకు తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

మృతుల్లో చర్చి ఫాదర్ దిలీప్ కుమారుడు హనిల్ సన్(4), మరో బాలిక జయశ్రీ అలియాస్ గ్రేసి(4)గా గుర్తించారు. చర్చి నిర్మాణం కోసం పునాదులు తీయగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆ గుంతలు నీటితో నిండిపోయాయి. అక్కడ ఆడుకున్న చిన్నారులు గుంతల్లో పడి చనిపోయారు.

చిన్నారుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు నాగిరెడ్డిపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Next Story