- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కందకంలో పడి ఇద్ధరు చిన్నారులు మృతి
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. బానాపూర్ తండాలోని అటవీ ప్రాంతంలో తవ్విన కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అటవీ ప్రాంతంలోని పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు భూక్య జగన్( 10), భూక్య శివ( 8) లను అడవి పందులు వెంబడించాయి. దీంతో పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారులు … రిజర్వు ఫారెస్టు కోసం తవ్విన కందకంలో పడ్డారు. కాగా ఇటీవల […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. బానాపూర్ తండాలోని అటవీ ప్రాంతంలో తవ్విన కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అటవీ ప్రాంతంలోని పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు భూక్య జగన్( 10), భూక్య శివ( 8) లను అడవి పందులు వెంబడించాయి. దీంతో పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారులు … రిజర్వు ఫారెస్టు కోసం తవ్విన కందకంలో పడ్డారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు కందకంలో నీరు చేరింది. దీంతో నీటిలో మునిగిపోయి ఇద్ధరు చిన్నారులు మరణించారు. దీనిపై లింగం పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






