ఆదిలాబాద్‌లో పులి చర్మం కలకలం

by  |
ఆదిలాబాద్‌లో పులి చర్మం కలకలం
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పులిచర్మం లభ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. బేల మండలంలోని సైదాపూర్ ప్రాంతంలో పులిచర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే గత కొన్ని రోజుల క్రితం ఓ పులిచర్మాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా బేల మండలంలోని సైదాపూర్ ప్రాంతంలో మరో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకోవడంతో పులుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. బేల మండలం సైదాపూర్ ప్రాంతంలో పట్టుపడిన పులిచర్మం ఎక్కడిది..? పులి‌ని ఎక్కడ చంపారు, అనే కోణంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి పులి చర్మం తీసుకువచ్చారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు విక్రయానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు పట్టుకున్నారు. మొత్తానికి అదిలాబాద్ జిల్లాలో తరుచూ పులి చర్మం లభ్యమవుతున్న ఘటనలు అటవీశాఖ అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.



Next Story