ట్విట్టర్‌లో.. డబ్బులు సంపాదించుకునే అవకాశం

by  |
ట్విట్టర్‌లో.. డబ్బులు సంపాదించుకునే అవకాశం
X

దిశ, ఫీచర్స్ : ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రకటనలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ట్విట్టర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ప్రారంభించబోయే రెండు కొత్త ఫీచర్లపై దృష్టి పెట్టింది. అందులో ఒకటి ‘సూపర్ ఫాలో’ ఫీచర్ కాగా, దీని ద్వారా యూజర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది.

ట్విట్టర్ యూజర్లు ఈ కొత్త ఫీచర్‌‌ను ఉపయోగించి వీడియోలు, కంటెంట్, లేటెస్ట్ న్యూస్, ఫొటోలు, ఇతర ఆసక్తికర విషయాలను షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసే ఈ స్పెషల్ ఫీడ్‌ను ఇతర యూజర్లు చూడాలంటే తప్పనిసరిగా సబ్‌స్ర్కైబ్ చేసుకోవడమే కాక, అందుకోసం వారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా వారు చెల్లించే ఫీజు ద్వారా ట్విట్టర్ యూజర్లు మనీ సంపాదించవచ్చు. కాగా సబ్‌స్ర్కైబ్ చేసుకున్న ఫాలోవర్లు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. చేసుకోనివారు ఈ కంటెంట్‌ను చూడలేరు. ఇలాంటి ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్ ‘జాయిన్’ అనే పేరుతో ఉంది. పాపులర్ కంటెంట్ క్రియేటర్స్‌కు ఇదో మంచి అవకాశం కాగా, ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు వారు అందించే కంటెంట్ నుంచి త్వరలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. పబ్లికేషన్స్, జర్నలిస్టులు, విలేకరులకు కూడా ఈ ‘సూపర్ ఫాలో’ ఆర్థికంగా ఉపయోగపడనుంది.

దీంతో పాటు ‘కమ్యూనిటీ’ ఫీచర్‌ను కూడా ట్విట్టర్ ఇంట్రడ్యూస్ చేయనుంది. ఇదికూడా ఫేస్‌బుక్ గ్రూప్స్ మాదిరిగానే పనిచేస్తుంది. యూజర్లు తమ ఆసక్తిని బట్టి సినిమా, ఆర్ట్స్, డిజైన్, క్యాట్స్, డాగ్స్, సోషల్ జస్టిస్, మొక్కలు.. ఇలా ఏ గ్రూపులోనైనా జాయిన్ కావచ్చు. ఆయా గ్రూపుల్లో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ కావచ్చు, అందులో ట్వీట్లను కూడా పంచుకోవచ్చు.

Next Story

Most Viewed