హృతిక్, విద్యాబాలన్‌పై ట్వింకిల్ ఖన్నా కామెంట్స్

by  |
హృతిక్, విద్యాబాలన్‌పై ట్వింకిల్ ఖన్నా కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ విద్యాబాలన్‌పై మాజీ హీరోయిన్, అక్షయ్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా ప్రశంసల వర్షం కురిపించింది. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వారు అందిస్తున్న తోడ్పాటును మెచ్చుకుంటూ తన ఇన్‌స్టాలో పోస్టులు పెట్టింది. ఈ మేరకు హృతిక్ ఫొటోను షేర్ చేసిన ట్వింకిల్..‘పొరుగువారికి సాయపడాలనే ఆలోచన అన్నింటికన్నా గొప్పది. ఈ క్లిష్ట సమయంలో అనేక మార్గాల్లో సేవలందిస్తున్న హృతిక్‌కు బిగ్ షౌట్ అవుట్’ అని రాసుకొచ్చింది. ఇక మంగళవారం విద్యాబాలన్‌ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ షేర్ చేసిన ఈ బాలీవుడ్ రచయిత.. ‘అపారమైన ప్రతిభ, అంతకన్నా మించిన హృదయమున్న విద్యాబాలన్‌కు థాంక్స్. పాండమిక్ సిచ్యువేషన్‌లో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ బీటౌన్ సెలబ్రిటీలు చేస్తున్న సహాయాన్ని ఫ్యాన్స్ సైతం అభినందిస్తున్నారు. ట్వింకిల్ పోస్టుపై హార్ట్ అండ్ అప్లాజ్ ఎమోజీలతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story