- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుర్కయంజాల్‌లో ‘తుగ్లక్’ కమిషనర్.. కలెక్టర్ అదేశాలు బేఖాతరు…
<p>దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కమిషనర్ ‘తుగ్లక్’లా వ్యవహరిస్తూ.. తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడంతో చైర్ పర్సన్, కౌన్సిలర్లు నిరసనలతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అభివృద్ధికి సహకరించని కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను తొలగించాలని చైర్ పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ తీరును వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు […]</p>

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కమిషనర్ ‘తుగ్లక్’లా వ్యవహరిస్తూ.. తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడంతో చైర్ పర్సన్, కౌన్సిలర్లు నిరసనలతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అభివృద్ధికి సహకరించని కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను తొలగించాలని చైర్ పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ తీరును వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు రెండు నెలల కింద రూ.9కోట్ల అతిముఖ్యమైన పనులకు కౌన్సిల్ తీర్మానించిందని, దీన్ని పక్కనబెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.
కమిషనర్ షఫీ ఉల్లా మున్సిపాలిటీ పరిధిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డంకిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో భవనాలను సీజ్ చేస్తూ… వాటి యజమానులతో సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు జరిమానా విధించి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా చేయాల్సింది పోయి… తన అనుచరులతో సెటిల్‌మెంట్లు చేయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని విమర్శించారు. పాలకవర్గం నుంచి ప్రజలకు అందాల్సిన సేవలను కమిషనర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మున్సిపల్ ఆఫీసుకు రాకుండా రెండో ఆఫీసు
తుర్కయంజాల్‌లోని మున్సిపల్ ఆఫీసుకు కమిషనర్ రావడం లేదని చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి ఆరోపించారు. మునగనూరులో రెండో ఆఫీసు తెరిచారని, అక్కడ నుంచే అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారని విమర్శించారు. కమిషనర్ షఫీ ఉల్లాకు ఓ టీఆర్ఎస్ కౌన్సిలర్ సహాయసహకారాలు అందిస్తున్నారన్నారు. ఏదో ఒక సమయం పెట్టుకొని ఆఫీసులో అందుబాటులో ఉండాలని షఫీ ఉల్లాను గతంలో కలెక్టర్ మందలించినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కౌన్సిల్‌లో ఎలాంటి తీర్మానం చేయకుండా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న జవాన్లను అకారణంగా వేరే ప్రాంతాలకు బదిలీ చేశారని, ఇదేమని ప్రశ్నిస్తే పొరపాటి జరిగినట్లు చెబుతున్నారని వాపోయారు. బిల్ కలెక్టర్లను బదిలీ చేయాలని కౌన్సిలర్లు సూచిస్తే అది మాత్రం చేయలేదన్నారు.
కమిషనర్‌పై మంత్రి కేటీఆర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు
అభివృద్ది పనుల కోసం కౌన్సిల్ తీర్మానం చేసి 51 రోజులైనా కమిషనర్ పట్టించుకోవడంలేదని, అవినీతిపరులకు కొమ్ముకాస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నారని, పాలకవర్గానికి సహకరించకుండా, ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్‌కు, కలెక్టర్‌కు, సీడీఎంఏకు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చైర్ పర్సన్, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కమిషనర్ షఫీ ఉల్లాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ హరితాధన్‌రాజ్‌గౌడ్, కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, కౌన్సిలర్ల ఫోరం జిల్లా అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, పలువురు కాంగ్రెస్ కౌన్సిర్లు పాల్గొన్నారు.






