Panchangam / Rasi Phalalu : మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (25-05-2021)

by  |
Panchangam / Rasi Phalalu : మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (25-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 10 ని॥ నుంచి
రాత్రి 8 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న ఉదయం 9 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 5 ని॥ వరకు)
యోగము : వరియానము
కరణం : గరజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ నుంచి 9 గం॥ 9 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 3 ని॥ నుంచి 10 గం॥ 55 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 28 ని॥ నుంచి 5 గం॥ 5 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి 10 గం॥ 33 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : తుల

మేష రాశి : చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. కొత్త పెట్టుబడుల వల్ల లాభాలు ఉంటాయని మీ దగ్గరికి కొందరు వస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది నమ్మకండి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రయత్నం చేస్తున్న బ్యాంకు రుణాలు లభిస్తాయి. సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా విజయవంతం అవుతాయి. ఈ రాశి స్త్రీలు మీ వైవాహిక జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.

వృషభ రాశి : వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా అందిపుచ్చుకోండి. ముఖ్య వ్యక్తులతో సంప్రదించండి. వ్యాపారంలో పెట్టుబడుల వంటి ముఖ్యమైన నిర్ణయాలలో ఇతరుల సలహాలను వినండి. అంతిమంగా మీ మనసు చెప్పిన దాన్ని ఆలోచించి తీసుకోండి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఈ రాశి స్త్రీలకు కుటుంబ విషయాలలో మీ జీవిత భాగస్వామితో ఏకాభిప్రాయానికి రండి.

మిధున రాశి : ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మొదట్లో నిరాశపరిచినా క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా వాడండి. మీ విలాసవంతమైన దుబారా ఖర్చులు ఇంటిలోని మిగిలిన వారికి కోపం తెప్పిస్తాయి. ఆఫీసులో మీరంటే పడని సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. ఈ రాశి స్త్రీలు కుటుంబంలోని వ్యక్తులు మీ బాధలను పంచుకోలేక పోతున్నారని బాధపడతారు.

కర్కాటక రాశి : స్థిరాస్తుల కొనుగోలులో ముందడుగు వేస్తారు. జీవితంలో చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడులు తొలగిపోతాయి. ముఖ్యముగా అనవసరపు ఖర్చులను నివారించడానికి ఒక ప్రణాళిక వేయండి. ఆఫీసులో సహ ఉద్యోగులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. మీ సోదరులు చేసిన సహాయం వలన వారి మీద మీకున్న దురభిప్రాయం తొలగిపోతుంది. ఈ రాశి స్త్రీలకు మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తారు.

సింహ రాశి : ఈ కరోనా వలన లేనిపోని భయాందోళనలకు గురి అవుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మీ ఆదాయ వ్యయాలను బేరీజు వేయండి. లేకుంటే రాబోయే కాలంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆఫీసులో ఈ రోజు మొత్తం పని సజావుగా సాగుతుంది. మీరు పొరపాటున నోరు జారడం వల్ల మీకు ఇష్టమైన వారు ఇబ్బంది పడతారు. ఈ రాశి స్త్రీలు పనిలో అధిక శ్రమ వలన ఇల్లు కాకుండా ఇంకా ఏదైనా మంచి ప్రదేశానికి వెళదాము అనుకుంటారు.

వృశ్చిక రాశి : ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. పెండింగ్ పడిన విషయాలలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక అయోమయంలో పడతారు. ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆఫీసులో మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి యొక్క మొండివైఖరి మొరటుతనం మిమ్మల్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది.

కన్య రాశి : సహనం, చిరునవ్వు మీకు దేవుడిచ్చిన వరం వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక లాభాలను పొందటానికి సరైన నిర్ణయం వెంటనే తీసుకోండి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ పెట్టి పని చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి యొక్క సోమరితనం మీకు విచారం కలిగిస్తుంది చిన్నచిన్న గొడవలు జరగవచ్చు.

తులా రాశి : మీ హుందాతనం మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాల కొరకు నూతన మార్గాలను వెతకటానికి దగ్గరి వారి సలహాలు తీసుకోండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని ఆనంద ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ధనుస్సు రాశి : ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి అతి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆవేశపడితే సన్నివేశాలకు దూరంగా ఉండండి. కొన్ని అనవసర ఖర్చులను పెట్టిన తర్వాత తీరికగా ఆలోచించి బాధపడతారు. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో శ్రమ తెలియకుండా ఉత్సాహంతో పని చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి పాత విషయాలను పూర్తిగా పక్కకు పెట్టేసి మీతో గడపటం మీకు ఆనందం ఇస్తుంది.

మకర రాశి : ఈ కరోనా సమయంలో నెగెటివ్ ఆలోచనలను వదిలివేయండి. లేకపోతే మీరు అశాంతికి గురికావటం కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇంటిలోనే పెద్దవారు మీ దురుసు ప్రవర్తనకు బాధపడతారు. మీ ప్రవర్తనను మార్చుకోండి. ఉద్యోగంలో కొత్త విధులు ఉత్సాహాన్నిస్తాయి. తోటి ఉద్యోగుల ప్రశంసలు ఆనందాన్నిస్తాయి. బయటి ప్రయాణాలు దుబారా ఖర్చులు మానివేయండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి.

కుంభ రాశి : ఉద్యోగంలో ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దాని వలన మీకు రావలసిన పేరు వేరొకరికి రాకుండా జాగ్రత్త పడండి. మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి దానిని బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యవహారాలతో విసిగిపోయి ఇంకెప్పుడు అప్పు చేయకూడదని నిర్ణయించుకుంటారు. బాధ్యతలతో మునిగిపోయి మీరు వారిని పట్టించుకోవడం లేదని మీ కుటుంబ సభ్యులు మీకు కంప్లైంట్ చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం తెలుస్తుంది.

మీన రాశి : ఆర్థిక విషయాలలో నూతన మార్గాలను అన్వేషిస్తారు. మీ తోడబుట్టిన వారు మీకు సహాయం చేస్తారు. ధర్మ మార్గంలో నడవండి. దైవ సహాయం లభిస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో కలసిమెలసి పనిచేస్తారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ తీరిక సమయంలో మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకుంటారు.


Next Story

Most Viewed