మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (18-05-2021)

by  |
మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (18-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న ఉదయం 11 గం॥ 32 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 20 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : తైతిల
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 2 ని॥ నుంచి 9 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి 9 గం॥ 9 ని॥ వరకు) (ఈరోజు ఉదయం 10 గం॥ 7 ని॥ నుంచి 10 గం॥ 58 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ నుంచి 5 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి 10 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 41 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కర్కాటకము

మేష రాశి : వ్యాపారం చాలా ఆశాజనకంగా సాగుతుంది. అనుకూలమైన సమయం. ఈ కరోనా సమయంలో మిమ్మల్ని మీరు కించపరచు కొని జాలి కోరవద్దు ధైర్యంగా నిలబడండి. దైవ సహాయం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సానుకూలంగా చర్చించండి అన్ని విషయాలు సర్దుకుంటాయి. ఈ రాశి స్త్రీలకు మెతకవైఖరి కొన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా ఉండండి.

వృషభ రాశి : రాజకీయ నాయకులు అధికారుల అండదండలు లభిస్తాయి. ఊహించని ఒక శుభవార్త మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ఆనందం కలిగి స్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు మీ తోటి వారిని అధిగమించాలంటే కొత్త కొత్త విషయాలను నేర్చుకోండి. నిరంతర కృషితోనే పైకి వస్తారు. ఈ రాశి పెళ్లి కాని స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది పెళ్లి జరుగుతుంది.

మిథున రాశి : ధన లాభం ఉంది. అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది. ఈ కరోనా సమయంలో విచారం మరచి ముందుకు సాగిపొండి స్నేహితులు మీకు అండగా నిలబడతారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన అన్ని విషయాలు చర్చించండి. అపోహలు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలు మీ మీద ఆధారపడిన వాళ్ళకి తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారు.

కర్కాటక రాశి : ఆరోగ్యం చక్కగా చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ తోటి ఉద్యోగులు మీ మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ముఖ్యముగా మత్తు పదార్థాలు సేవించడం వలన లేనిపోని చిక్కులు రావచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు ప్రతి విషయాన్ని అనవసరంగా సాగదీయకండి.

సింహ రాశి : ఉద్యోగస్తుల కే చాలా అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీ ఊహలకు తగిన విధంగా ఉండదు. వారితో సానుకూలంగా వ్యవహరించండి. మీరు ఎంతో కాలం నుంచి తీసుకుందాం అనుకుంటున్న రుణము తీసుకునే మంచి సమయం. ఈ రాశి స్త్రీలకు మీ ప్రతిభ మిమ్మల్ని నిలబెడుతుంది.

తులా రాశి : వ్యాపారం విస్తరించడానికి సరైన సమయం. కొత్త పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కరోనా ఈ సమయంలో కుటుంబ విలువ పూర్తిగా తెలుసు కుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబంలో ఇతరుల జోక్యాన్ని మీరు అడ్డుకుంటారు.

కన్య రాశి : ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడులు పెడదాము అనుకునేవారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు కొత్త కొత్త విషయాలను నేర్చుకుని ప్రయత్నించండి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి స్త్రీలు తల్లిదండ్రుల పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

వృశ్చిక రాశి : మీ మనోబలం మొండి ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఇంతకు ముందున్న డబ్బు పరమైన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఇంతకుముందు ఇబ్బంది కరమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి లేనిపోని వివాదాలను కొని తెచ్చుకోకండి. ఈ రాశి స్త్రీలకు వ్యాపార విస్తరణకు విశేషంగా కృషి చేస్తారు.

ధనుస్సు రాశి : ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. మీ సహోదరులకు ఆర్థిక సహాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. కార్యాలయంలో మీరు ఇంతకుముందు చెయ్యకుండా ఉంచిన ఒక ముఖ్యమైన పనిని అతి శ్రద్ధతో చేస్తారు మీ సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు మీ మనసులోని భావాలను ఇతరులకు తెలియజేయడం వల్ల చాలామంది విరోధులు అవుతారు.

మకర రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టబోయే సమయంలో అవతల వ్యక్తుల గురించి పూర్తిగా వివరాలు సేకరించి నిర్ణయం తీసుకోండి. మీ సన్నిహితులతో పూర్తిగా సానుకూలంగా మాట్లాడి నిజాలను తెలుసుకోండి. తోటి ఉద్యోగుల సహకారంతో ఆఫీసులో వర్క్ చాలా బాగా జరుగుతుంది. మీరు అనుకోకుండా మాట్లాడిన మాటలు కుటుంబసభ్యులను భావించవచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలు కొద్దిపాటి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి : ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. కార్యాలయంలోని అన్ని ముఖ్యమైన పనులు ఒక్కసారే రావడం వల్ల చికాకులు కలుగుతాయి. పొరపాట్లను సరిదిద్దుకొని అనుకున్న వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యాపారంలో మీ సన్నిహితులు ఇచ్చిన సలహాలను పాటించండి మీకు ఆర్థికంగా లాభదాయకం. కుటుంబంలోని వ్యక్తుల కోసం అధిక శ్రమ పడవలసి రావచ్చు అయినా అది మీకు ఆనందం కలిగిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీరు కోరుకున్న చోట చదువుకోవటానికి అవకాశం లభిస్తుంది.

మీన రాశి : ఈ కరోనా సమయములో వ్యాపారంలో పూర్తి శ్రద్ధ పెట్టండి. ఆర్థికపరమైన కోర్టు కేసులో తీర్పు మీకు పూర్తిగా అనుకూలిస్తుంది మీకు ఎంతో లాభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి అది మీకు ఎంతో బలాన్నిస్తుంది. తోటి ఉద్యోగులతో జాగరూకతతో వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు మీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి శ్రమిస్తారు.


Next Story

Most Viewed