మంగళవారం పంచాంగం, రాశి ఫలాలు (20-04-2021)

by  |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : అష్టమి రా 7.12
తదుపరి నవమి
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : పుష్యమి తె 3.00
తదుపరి ఆశ్లేష
యోగం : ధృతి మ 3.19
తదుపరి శూలం
కరణం : భద్ర/విష్ఠి ఉ 6.59
తదుపరి బవ రా 7.12
ఆ తదుపరి బాలువ
వర్జ్యం : ఉ 10.22 – 12.02
దుర్ముహూర్తం : ఉ 8.14 – 9.04 &
రా 10.49 – 11.35
అమృతకాలం : రా 8.20 – 10.00
రాహుకాలం : మ 3.00 – 4.30
యమగండం/కేతుకాలం: ఉ 9.00 – 10.30
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 5.46 || సూర్యాస్తమయం : 6.12

(20-04-2021) రాశి ఫలితాలు

మేషం:

చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్యా ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.

వృషభం:

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల సహాయం అందుతుంది సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా స్వంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.

మిధునం:

నేత్ర సంభందిత అనారోగ్యసమస్యలు కలుగుతాయి చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగాఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి.

కర్కాటకం:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం:

చేపట్టిన పనుల యందు జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య:

ఆర్ధిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. బంధు మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి.

తుల:

శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఉద్యోగమున సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి .

వృశ్చికం:

కుటుంబ సభ్యులతోచిన్నపాటి వివాదాలు ఉంటాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల మాటల వలన మానసికఅశాంతి కలుగుతుంది. వ్యాపారం మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు:

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.విద్యార్దులు మరింత కష్టపడాలి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి.వృధా ఖర్చులు చేస్తారు.

మకరం:

ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో నూతనపరిచయాలు కలుగుతాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

కుంభం:

ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ​

మీనం:

వివేచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనాలుకొనుగోలుచేస్తారు. దూరప్రాంతాలనుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం నుండి శుభ వార్తలు అందుతాయి.


Next Story

Most Viewed