- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రానికి టీఎస్‌యూటీఎఫ్ సర్వే నివేదిక
<p>దిశ, న్యూస్‌బ్యూరో: పాఠశాలల పునర్ ప్రారంభం, విద్యాబోధన ఏ విధంగా ఉండాలనే అంశాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను జూలై 20లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ కోరిన నేపథ్యంలో టీఎస్‌యూటీఎఫ్ ఇటీవల నిర్వహించిన సర్వే రిపోర్టును అందజేసింది. తల్లిదండ్రుల, విద్యార్థుల అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను, టీఎస్‌యూటీఎఫ్ సూచనలతో సహా కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ సంప్లేకి సోమవారం ఈ మెయిల్ ద్వారా పంపించినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: పాఠశాలల పునర్ ప్రారంభం, విద్యాబోధన ఏ విధంగా ఉండాలనే అంశాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను జూలై 20లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ కోరిన నేపథ్యంలో టీఎస్‌యూటీఎఫ్ ఇటీవల నిర్వహించిన సర్వే రిపోర్టును అందజేసింది. తల్లిదండ్రుల, విద్యార్థుల అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను, టీఎస్‌యూటీఎఫ్ సూచనలతో సహా కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ సంప్లేకి సోమవారం ఈ మెయిల్ ద్వారా పంపించినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి తెలిపారు. విద్యా సంవత్సరం నిర్వహణ, పాఠశాలల పునర్‌ప్రారంభం, ఆన్లైన్ విద్యా బోధనకు గల అవకాశాలు, అవరోధాలు తదితర 20 అంశాలపై జూన్ 22 నుంచి 27 వరకు 33 జిల్లాల్లోని 489 మండలాల్లో 1,868 గ్రామాలు/ మునిసిపల్ వార్డుల్లో సర్వే నిర్వహించి సేకరించిన సమాచారంతో రూపొందించిన సమగ్రమైన నివేదికను జూలై 3వ తేదీన విడుదల చేసిన విషయం విధితమే. ఆ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యామంత్రి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. సేకరించిన సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోపడనున్నదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తెలిపింది.






