పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక..

by  |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ అమలు చేయకపోతే ఆర్టీసీ కార్మికుల్లో అశాంతి పెరిగి పారిశ్రామిక వివాదాలకు దారి తీస్తే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం వారు ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వోద్యోగులకు 2018లో ప్రభుత్వం రావల్సిన వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్ అమలు చేసిందని, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 30 శాతం వేతన సవరణ చేసింది కానీ, ఆర్టీసీ కార్మికులకు 2017లో రావల్సిన వేతన సవరణను నేటి వరకు ఇవ్వలేదన్నారు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి 2017 వేతన సవరణ అమలు చేయాలని, 2021 వేతన సవరణపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీలో 9400 బస్సులే ఉన్నాయని, వీటిలో 3200 అద్దె బస్సులు కాగా, సుమారు 3వేల వరకు కాలం చెల్లినవి ఉన్నాయని, ప్రజల సౌకర్యం కోసం 1300 కొత్తబస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా డబ్బులు లేవనే సాకుతో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచడం, బ్యూరో క్రాట్లకు లగ్జరీ కార్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఆర్టీసీ 100 కోట్లు కేటాయిస్తే 500ల బస్సులు కొని ప్రజలకు సౌకర్యం కల్పించవచ్చని సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed