తీన్మార్ మల్లన్నపై హైకోర్టు ఆగ్రహం

by  |
తీన్మార్ మల్లన్నపై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తరచూ ఆరోపణలు, విమర్శలు చేసే తీన్మార్ మల్లన్నపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించింది. అసలు విషయానికొస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాడంటూ.. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న హైకోర్టులో జులై 8న మాండమస్ పిటిషన్ వేశారు.

సీఎం ఆరోగ్యం ఎలా ఉందో ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ పిటిషన్‌లో వెల్లడించారు. ప్రగతి భవన్‌లో కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ అవుతుందని పిటిషన్‌లో వివరణ ఇచ్చారు. అయితే, ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పిటిషన్లు విచారించలేమని తేల్చి చెబుతూనే తీన్మార్ మల్లన్నను హెచ్చరించింది. సీఎం కేసీఆర్ కనిపించకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాలని.. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించలేమని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed