వీఆర్వోల సేవలను ప్ర‌భుత్వం గుర్తించాలి

by Sridhar Babu |

<p>దిశ‌, ఖ‌మ్మం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు అన్నారు. గురువారం వీఆర్వోల సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు వైద్య , పోలీస్ అధికారులకు దీటుగా రెవెన్యూ ఉద్యోగులు సేవలు అందిస్తున్న విష‌యాన్ని ప్ర‌భుత్వం గుర్తించాల‌న్నారు.కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రెవెన్యూ ఉద్యోగులు [&hellip;]</p>

వీఆర్వోల సేవలను ప్ర‌భుత్వం గుర్తించాలి
X

దిశ‌, ఖ‌మ్మం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు అన్నారు. గురువారం వీఆర్వోల సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు వైద్య , పోలీస్ అధికారులకు దీటుగా రెవెన్యూ ఉద్యోగులు సేవలు అందిస్తున్న విష‌యాన్ని ప్ర‌భుత్వం గుర్తించాల‌న్నారు.కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రెవెన్యూ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూనే తమకు కేటాయించిన విధుల‌ను బాధ్యతగా నిర్వ‌ర్తించాల‌న్నారు. వీఆర్వోలను అందరి ఉద్యోగులుగా కాకుండా వారి సేవలను ప్రత్యేకంగా గుర్తించి స్పెషల్ ఇన్సెంటివ్ అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి చీమల నాగేంద్రబాబు, బంకా భాస్కర్, బంక కృష్ణ, శ్రీను, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: village revenuve officers, kammam, special incentive, ts govt, garike upender

Next Story