నల్లగొండలో కాంగ్రెస్ నిరసనలు.. సీఎం యోగీ దిష్టిబొమ్మ దహనం

by  |
congress
X

దిశ, నల్లగొండ: కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతులను వాహనంతో గుద్ధి చంపడం అత్యంత హేయమైన చర్య అని, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం ఏంటని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ధ్వజమెత్తారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ గడియారం చౌరస్తాలో యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలి ఎండ వానలను లెక్క చేయకుండా శాంతి యుతంగా ఏడాదిగా ఉద్యమంగా చేస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ రైతులను కాన్వాయ్ తో చంపిన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని, మంత్రిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో 80 శాతం మంది వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్నారని, ఓపెన్ మార్కెట్ నూతన వ్యవసాయ చట్టాల పేరుతో కనీస మద్దతు ధర లేకుండానే కేంద్రం బ్లాక్ మార్కెట్ కు తెరలేపిందని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరొక మార్గం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు .


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed