‘ఆరే’సిన కారు.. క్రాస్ ఓటింగ్‌తో గులాబీలో గుబులు.. గెలిచింది వీరే..

by Vadlamudi Anukaran |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ మరోసారి సత్తా చాటింది. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్‌దే విజయమని ఢంకా మోగించే పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. క్రాస్ ఓటింగ్ జరగకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ ఖమ్మం మినహా మిగిలిన నాలుగు జిల్లాల్లో ఒక్క ఓటు కూడా స్వతంత్ర అభ్యర్థులకు పడలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను సైతం తమవైపు తిప్పుకోవడం లో టిఆర్ఎస్ సక్సెస్ అయింది. ఆరు స్థానాలకు గాను ఆ రెంటిని [&hellip;]</p>

trs-flag 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ మరోసారి సత్తా చాటింది. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్‌దే విజయమని ఢంకా మోగించే పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది.
క్రాస్ ఓటింగ్ జరగకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ ఖమ్మం మినహా మిగిలిన నాలుగు జిల్లాల్లో ఒక్క ఓటు కూడా స్వతంత్ర అభ్యర్థులకు పడలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను సైతం తమవైపు తిప్పుకోవడం లో టిఆర్ఎస్ సక్సెస్ అయింది. ఆరు స్థానాలకు గాను ఆ రెంటిని కైవసం చేసుకొని తమకు తిరుగులేదని టిఆర్ఎస్ మరోసారి స్పష్టం చేసింది.

ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఒక స్థానానికి, కరీంనగర్‌లో రెండు.. ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఆరు స్థానాల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అధికార పార్టీ భావించి ముందస్తుగానే క్యాంపు రాజకీయాలు చేసింది. దీంతో ఒక్క ఓటు కూడా స్వతంత్ర అభ్యర్థులకు పడకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ సూచనలతో పకడ్బంధీ ప్రణాళికతో సక్సెస్ అయింది. టీఆర్ఎస్ అభ్యర్థులు మెదక్‌లో యాదవ రెడ్డి (762), ఆదిలాబాద్‌లో విఠల్ (742), నల్లగొండలో కోటిరెడ్డి (917), కరీంనగర్‌లో భాను ప్రసాద్ రావు (584), ఎల్ రమణ (479), ఖమ్మంలో మధు (480) విజయం సాధించారు. ఆరు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.

మెదక్‌లో 1018 పోలైన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డికి 762 ఓటు రాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. 524 ఓట్లతో యాదవ రెడ్డి విజయం సాధించారు.

ఆదిలాబాద్‌లో 862 ఓట్లు పోల్ కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్‌కు 860 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి పుష్ప రాణికి 75 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా 45 ఓట్లు చెల్లలేదు. 667 ఓట్ల మెజార్టీతో విఠల్ విజయం సాధించారు.

నల్లగొండలో 1183 ఓట్లు పోల్ కాగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి కొడుదుల నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 961 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం చెల్లని ఓట్లు 50.

కరీంనగర్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ రావుకు 584 ఓట్లు రాగా, ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్‌కు 231 ఓట్లు వచ్చాయి. దీంతో భాను ప్రసాద్, రమణ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఖమ్మంలో 738 ఓట్లు పోల్ కాగా టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుకు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుకు 242 ఓట్లు వచ్చాయి. దీంతో మధు 238 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. చెల్లని ఓట్లు 12 కాగా, స్వతంత్ర అభ్యర్థులకు నాలుగు ఓట్లు వచ్చాయి.

ఖమ్మంలో క్రాస్ ఓటింగ్..

స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో 116 మంది ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర రావుకు 242 ఓట్లు వచ్చాయి. 126 ఓట్లు అదనంగా పోలయ్యాయి. అంటే ముందు నుంచి ఊహించినట్లుగానే ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతున్నది. ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ విజయం సాధించి తన పట్టును నిలుపుకుంది.

పంతం నెగ్గించుకున్న జగ్గారెడ్డి

మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 230 ఓట్ల కంటే ఒక ఓటు తక్కువగా వచ్చినా తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే 238 ఓట్లు సాధించి పంతం నెగ్గించుకున్నారు.

Next Story