సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన ‘కోడ్’.. విజయగర్జన మీట్‌కు మరోసారి బ్రేక్

by  |
cm-kcr
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రతిష్టాత్మకంగా త‌ల‌పెట్టిన విజ‌య‌గ‌ర్జన స‌భ మ‌రోసారి వాయిదా ప‌డింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట రింగు రోడ్డు పక్కన ఈనెల 29న జరగాల్సిన ఈ సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 15న విజయగర్జన సభను నిర్వహించాలని భావించిన అధిష్ఠానం దీక్షా దివస్ రోజున (నవంబర్​ 29) తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహించాల‌ని వాయిదా వేసుకుంది.

ఈ మేర‌కు గ‌త ఐదు రోజులుగా దేవ‌న్నపేట‌లో శ‌ర‌వేగంగా స‌భా ఏర్పాట్లు కొన‌సాగుతున్న క్రమంలోనే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డం మ‌రోసారి వాయిదా ప‌డ‌క త‌ప్పలేదు. దీంతో ఈనెల 10న కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న కూడా వాయిదా ప‌డింది. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.



Next Story