- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాకలో టీఆర్ఎస్‌కి షాక్.. అనుచరులతో కలిసి బీజేపీలోకి కీలక నేత..
<p>దిశ ప్రతినిధి, మెదక్: అధికార పార్టీ కి కంచుకోటయైన సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. టీఆర్ఎస్ వీడుతున్న నాయకులంతా బీజేపీలో చేరుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపొందిన తర్వాత జిల్లాలో బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా సోంత పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. తాజాగా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి దేవిరెడ్డి, మండలంలోని తన అనుచరులతో కలిసి బీజేపీ […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: అధికార పార్టీ కి కంచుకోటయైన సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. టీఆర్ఎస్ వీడుతున్న నాయకులంతా బీజేపీలో చేరుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపొందిన తర్వాత జిల్లాలో బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా సోంత పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. తాజాగా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి దేవిరెడ్డి, మండలంలోని తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇందుకు అందరం సమన్వయంతో కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
Next Story






