- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మకానికి టీఆర్ఎస్ కండువాలు.. ధర ఎంతో తెలుసా?
<p>దిశ, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలు మాదాపూర్ హైటెక్స్‌లో అట్టహాసంగా ప్రారంభయ్యాయి. ఉదయం నుండే ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు ప్లీనరీ వద్దకు చేరుకుంటున్నారు. ప్లీనరీలో పాల్గొనేందుకు పాసులు ఇచ్చిన ఆహ్వాన కమిటీ పార్టీ కండువాలను మాత్రం పంపిణీ చేయలేదు. అటు అందరూ గులాబీ కలర్ చొక్కాలు ధరించి ప్లీనరీకి హాజరు కావాలని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా.. చాలామంది నాయకులు ఎప్పటిలాగే ఖద్దరు […]</p>

దిశ, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలు మాదాపూర్ హైటెక్స్‌లో అట్టహాసంగా ప్రారంభయ్యాయి. ఉదయం నుండే ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు ప్లీనరీ వద్దకు చేరుకుంటున్నారు. ప్లీనరీలో పాల్గొనేందుకు పాసులు ఇచ్చిన ఆహ్వాన కమిటీ పార్టీ కండువాలను మాత్రం పంపిణీ చేయలేదు. అటు అందరూ గులాబీ కలర్ చొక్కాలు ధరించి ప్లీనరీకి హాజరు కావాలని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా.. చాలామంది నాయకులు ఎప్పటిలాగే ఖద్దరు చొక్కాలకే పరిమితం అయ్యారు. ఇక గులాబీ షర్ట్స్ లేని వారిని తప్పనిసరిగా కండువా వేసుకోవాల్సిందే అని చెబుతున్నారు వాలంటీర్లు. దీంతో భారీగా టీఆర్ఎస్ కండువాలు అమ్ముతున్నారు. మాదాపూర్ హైటెక్స్ బయట రూ.50కి ఒక కండువా కొనుక్కుని ప్లీనరీలోకి గులాబీ నేతలు వెళ్తున్నారు. కండువా లేకపోతే లోపలికి రానివ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.






