మా విజయం ఖాయం

34

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాంపల్లిలోని యుసేఫియన్ దర్గాలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధిన్‌లతో కలిసి ఆయన చాదర్‌ను ఆదివారం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నందున దర్గాలో చాదర్ సమర్పించినట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తప్పక విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ పార్టీ విజయం ఖాయమన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..