- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెల్లును గెలిపించి.. బీజేపీని గల్లంతు చేయాలి : చల్లా
<p>దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న తరుణంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తోన్న బీజేపీని తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో భారీగా పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అసత్య ప్రచారాలతో కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి యువతను పెడదారి పట్టించి, రాజకీయ లబ్ది పొందాలని […]</p>

దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న తరుణంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తోన్న బీజేపీని తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో భారీగా పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అసత్య ప్రచారాలతో కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి యువతను పెడదారి పట్టించి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఉద్యమ బిడ్డ అయినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బీజేపీని హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓడించి, రాష్ట్రంలో వాళ్ల అడ్రస్ గల్లంతు చేయాలన్నారు. అనంతరం గూడూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






