ఉమ్మడి నల్లగొండ సీఎం కేసీఆర్ వెంటే.. మంత్రి జగదీష్

by Shyam |

<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ మాట్లాడుతూ.. కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టం అయిందని, జిల్లా ప్రజలు ప్రతిపక్షాలకు సరైన పాఠం నేర్పారని అన్నారు. ఈ విజయానికి సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన [&hellip;]</p>

Minister Jagadish Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ మాట్లాడుతూ.. కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టం అయిందని, జిల్లా ప్రజలు ప్రతిపక్షాలకు సరైన పాఠం నేర్పారని అన్నారు.

ఈ విజయానికి సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విధంగా టీఆర్ఎస్‌ను బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్‌కి పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతమైన శక్తిగా రూపొందిందన్నారు.

Next Story