బ్రేకింగ్.. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన టీఆర్ఎస్ నేతలు..

by  |
బ్రేకింగ్.. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన టీఆర్ఎస్ నేతలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు గురువారం ప్రొటెం చైర్మన్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మండలిలో, బయట గళమెత్తుతానని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. కేంద్రం దిగి వచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని గుత్తా డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని, మరింత బాధ్యతతో పని చేస్తానని స్పష్టం చేశారు. ఉద్యమకారులను కాపాడుకుంటామని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతానని తెలిపారు.

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పనిచేసే వారిని చేయనివ్వరు.. వారు చేయరు.. అని కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీల నేతలు బేవకూఫ్‌లు అని తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. బీజేపీకి రైతులపై చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నమ్మకంతో, మరింత బాధ్యతతో పని చేస్తానని వెల్లడించారు. హుజురాబాద్‌లో ఈటల చేసింది శూన్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ‌ ఎన్నికల్లో కరీంనగర్‌లో రెండు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో త్రుటిలో తప్పిపోయి.. ఈటల గెలిచాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈటల సర్పంచ్‌గా కూడా గెలవలేడు అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై ఎంపీ బండి సంజయ్‌ని, ఎమ్మెల్యే ఈటలను నిలదీస్తామని స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed