Leonia రిసార్ట్‌లో ఏం జరుగుతోంది.. TRS సీక్రెట్ మీటింగ్స్‌పై ‘దిశ’ స్పెషల్ ఫోకస్

by  |
Leonia రిసార్ట్‌లో ఏం జరుగుతోంది.. TRS సీక్రెట్ మీటింగ్స్‌పై ‘దిశ’ స్పెషల్ ఫోకస్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : శామీర్‌పేటలోని లీయోనియా రిసార్ట్స్‌లో స్థానిక సంస్థల ప్రతినిధులతో మంత్రులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఈ సమావేశాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్‌తో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎంపీటీసీల నైరాశ్యం..

అయితే, క్యాంపులకు వెళ్లిన ఎంపీటీసీలు అక్కడ తమ నిరసనను మాత్రం వ్యక్తం చేయడంలో వెనకడుగు వేయడంలేదని తెలుస్తోంది. తమకు అధికారాలు, నిధులు, కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవని తమ పదవి ఉన్న ఒకటే.. లేకున్నా ఒకటేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విశ్వాసనీయ సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకునేందుకు మాత్రమే తమను కౌంట్‌లోకి తీసుకుంటున్నారు తప్ప మిగతా అన్ని విషయాల్లో విస్మరిస్తున్నారని మండిపడుతున్నారని తెలిసింది. మొక్కుబడిగా మారిన తమ పదవులతో ఉత్సవ విగ్రహాలుగా మారామని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

నో ఫెసిలిటీస్..

తమను తీసుకొచ్చి రిసార్ట్స్‌లో పడేశారు తప్ప బాగోగులు చూసుకునే వారే లేకుండా పోయారన్న ఆవేదన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో వ్యక్తం అవుతోంది. మంగళవారం రాత్రి ఇక్కడకు చేరుకున్నా వసతి నుండి మొదలు భోజన సదూపాయాలు కల్పించడంలో వివక్ష చూపుతున్నారని కొంతమంది ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసౌకర్యాల నడుమ ఉండటం కన్నా తాము ఇళ్లలో ఉండిపోయినా బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఓటర్లు మిస్సింగ్..

శామీర్‌పేట్‌లోని రిసార్ట్స్‌‌కు చేరుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో కొంతమంది సౌకర్యాలపై పెదవి విరిచి తమ స్వస్థలాలకు వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. సుమారు వందమంది ఓటర్లు క్యాంప్ నుండి వెళ్లిపోయారని సమాచారం.


Next Story