- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీనరీకి వచ్చే వారికి అదిరిపోయే కిట్టు.. రూపొందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
<p>దిశ, కుత్బుల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర సమితి 20 వసంతాల వేడుక సోమవారం హైటెక్ సిటీలో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ప్లీనరీకి వచ్చే వారందరికీ బహమానంగా ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం బ్యాగులను అందజేసేది. ఈ దఫా మాత్రం వెరైటీగా బ్యాగుతో పాటు అందులో అవసరమైన 10 రకాల వస్తువులతో ఓ కిట్టును ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్ రాజు పర్యవేక్షణలో రూపొందించారు. ఇందులో కండువా, రెండు మాస్కుల ప్యాకెట్లు, శానిటైజర్, […]</p>

దిశ, కుత్బుల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర సమితి 20 వసంతాల వేడుక సోమవారం హైటెక్ సిటీలో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ప్లీనరీకి వచ్చే వారందరికీ బహమానంగా ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం బ్యాగులను అందజేసేది. ఈ దఫా మాత్రం వెరైటీగా బ్యాగుతో పాటు అందులో అవసరమైన 10 రకాల వస్తువులతో ఓ కిట్టును ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్ రాజు పర్యవేక్షణలో రూపొందించారు. ఇందులో కండువా, రెండు మాస్కుల ప్యాకెట్లు, శానిటైజర్,
విసన కర్రలు, ఒక్కో బ్యాగు, రెండు జెండాలు, కీ చైన్, పెన్ను, ఒక నోటు పుస్తకంతో 10 వేల బ్యాగులను రూపొందించారు. ప్లీనరీకి
వచ్చే వారందరికీ ఈ బ్యాగులను అందజేయనున్నట్లు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. ప్రతి వస్తువుపైనా.. ప్లీనరీకి వచ్చే వారందరికీ ఇచ్చే బ్యాగుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల బొమ్మలు ముద్రించారు. అయితే ప్రతి వస్తువుపై గులాబీ రంగు కన్పించడంతో పాటు కేసీఆర్, కేటీఆర్ లబొమ్మలు ముద్రించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు లోపలికి వచ్చిన వారందరికీ వాటర్ బాటిల్, మజ్జిగ బాటిళ్లను కూడా పంపిణీ చేయనున్నారు.







