శంషాబాద్ MRO జనార్దన్ రావు కు ఘన సన్మానం..

by Shyam |

<p>దిశ, శంషాబాద్ : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నది ఉద్యోగస్తులే అని టీఆర్ఎస్ యూత్ జిల్లా ఉపాధ్యక్షులు రాచమల్ల సురేష్ అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రాచమల్ల సురేష్ ఆధ్వర్యంలో శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాచమల్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ [&hellip;]</p>

శంషాబాద్ MRO జనార్దన్ రావు కు ఘన సన్మానం..
X

దిశ, శంషాబాద్ : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నది ఉద్యోగస్తులే అని టీఆర్ఎస్ యూత్ జిల్లా ఉపాధ్యక్షులు రాచమల్ల సురేష్ అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రాచమల్ల సురేష్ ఆధ్వర్యంలో శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాచమల్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ జనార్దన్ రావు సేవలందిస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు సకాలంలో అందేలా చూడడంలో ఎప్పుడూ ముందువరుసలో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేకల వెంకటేష్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story