బ్రేకింగ్ : బరితెగించిన టీఆర్ఎస్ లీడర్లు.. దళిత బీజేపీ కౌన్సిలర్‌పై దాడి

by  |
బ్రేకింగ్ : బరితెగించిన టీఆర్ఎస్ లీడర్లు.. దళిత బీజేపీ కౌన్సిలర్‌పై దాడి
X

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ 9వ వార్డులో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ప్రతీ దసరాకు కండ్లకోయ గ్రామంలో ప్రజాప్రతినిధి జెండా ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. కండ్లకోయ మున్సిపాలిటీ ఏర్పడటం వల్ల స్థానిక బీజేపీ కౌన్సిలర్ హంసా రాణి కృష్ణ గౌడ్ ఈ సంవత్సరం జెండాను ఆవిష్కరించడంతో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని జెండాను తొలగించారు.దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డిలు కలిసి స్థానికంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే తమ పార్టీ కౌన్సిలర్ జెండా ఎగురవేయకుండా అడ్డుకుని తమపై దాడికి పాల్పడ్డారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. అధికార బలం చూసుకుని పోలీసులను తమపై లాఠీచార్జి చేసేలా ఉసిగొల్పారని మండిపడ్డారు. అయితే, తాను దళిత మహిళ కావడం వల్లే దసరా వేడుకల్లో జెండాను ఆవిష్కరించకుండా అడ్డుకుని, దాడి చేశారని కౌన్సిలర్ హంసా రాణి ఆవేదన వ్యక్తంచేశారు.



Next Story

Most Viewed