టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

by Sridhar Babu |   (  Updated:2021-08-21 06:55:39  IST  )

<p>దిశ, గోదావరిఖని : మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన TRS నాయకుడు తీగల సత్యనారాయణ రావు.. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే [&hellip;]</p>

టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత
X

దిశ, గోదావరిఖని : మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన TRS నాయకుడు తీగల సత్యనారాయణ రావు.. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, వార్డ్ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story