బీజేపీలో చేరిన స్వామిగౌడ్

by  |
బీజేపీలో చేరిన స్వామిగౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. స్వామిగౌడ్ వెంట ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న స్వామిగౌడ్‌ను 4రోజుల క్రితం బండి సంజయ్, లక్ష్మణ్ కలిసి బీజేపీలో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ఇక త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోని కీలక నేత కమలం గూటికి చేరడంతో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలినట్టైంది.

బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీలో స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులకు గౌరవం లభిస్తుందనే బీజేపీలో చేరానని, తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని తెలిపారు. రెండేళ్లుగా సీఎం కేసీఆర్‌ను కలవాలని ప్రయత్నిస్తున్నానని, 200సార్లు అపాయిమెంట్ కోసం ఎదురు చూశానని వెల్లడించారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ ఆమోదస్తారని అనుకుంటున్నాని పేర్కొన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.


Next Story