బీజేపీలోకి స్వామిగౌడ్ ?

by  |
బీజేపీలోకి స్వామిగౌడ్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న బీజేపీ.. లేటెస్ట్‌గా మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు కాషాయ కండువా కప్పేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం స్వామిగౌడ్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనమండలికి తొలి ఛైర్మన్ అయిన స్వామిగౌడ్‌ను.. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసాక కేసీఆర్ పట్టించుకోక పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రెండు మూడు నెలల క్రితం కేసీఆర్, కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టీఆర్ఎస్‌కు అంటిముట్టనట్లు ఉంటున్నారు.

ఉద్యోగ సంఘాల్లో పట్టుతో పాటు, స్వామిగౌడ్ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకున్న కమలనాథులు బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ రెడీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే స్వామిగౌడ్‌ను పార్టీలోకి తీసుకువస్తే బీజేపీకి కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం లేదా చెవెళ్ల ఎంపీ స్థానంపై క్లారిటీ ఇచ్చి ఇవాలో రేపో పార్టీ కండువా కప్పేందుకు మొత్తం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎలక్షన్‌ టైంలో చేరికలపై ప్రధానంగా దృష్టిసారించిన బండి సంజయ్‌ శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కలిసి పార్టీలోకి ఆహ్వానించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఇదేక్రమంలో ఇవాళ స్వామిగౌడ్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే స్వామిగౌడ్‌ నుంచి సానుకూల ప్రకటన వస్తే ఎలక్షన్స్‌కు ముందే కమలం గూటికి చేర్చేలా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.


Next Story

Most Viewed