‘నాయిని’హెల్త్ కండిషన్ సీరియస్

by  |
‘నాయిని’హెల్త్ కండిషన్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 28న కరోనా బారిన పడిన నాయిని.. పది రోజుల చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌ ఉంచి వైద్యం అందిస్తున్నారు.

నాయిని పరిస్థితి విషమం..

డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో మాజీ హోంమంత్రికి ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని వైద్యులు గుర్తించారు. దీనివల్లే అయన ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఈ క్రమంలోనే అయన్ను మంగళవారం అపోలోకు తరలించారు. నాయిని భార్య అహల్య కూడా కరోనా బారిన పడింది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నారు.


Next Story

Most Viewed