ఆస్ట్రేలియా జర్నలిస్ట్ వీసా వివాదం.. స్పందించిన అగ్రరాజ్యం

by Dishanational6 |
ఆస్ట్రేలియా జర్నలిస్ట్ వీసా వివాదం.. స్పందించిన అగ్రరాజ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ లో వీసా విధానంపై అమెరికా స్పందించింది. భారత్ తన సొంత వీసా విధానం ప్రకారం.. దేశంలోకి ఎవరు ప్రవేశించాలి.. ఎవరు వద్దు అనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. షార్ట్ టర్మ్ ట్రావెలర్స్ లేదా అంతర్జాతీయ జర్నలిస్టులుగా ఎవరు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలి అనేది భారత్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్.

వీసా గడువు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో భారత్ వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అవనీ దియాస్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం తర్వాత వీసా పొడిగించినా, ఆ విషయాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో భారత్ వీడాల్సి వచ్చిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన ఈ నెల 19నే భారత్ ను వదిలి వెళ్లినట్లు సోషల్ మీడియాలో తెలిపారు అవనీ దియాస్. ఈ వివాదంపైనే అమెరికా స్పందించింది.

భారత ప్రభుత్వం తన సొంత వీసా విధానాన్ని పాటించవచ్చనారు వేదాంత్ పటేల్. దానిపై తాను ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పాలనుకోవట్లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పారు. పత్రికా స్వేచ్ఛ పోషించే సమగ్ర పాత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్పష్టంగా ఉన్నామన్నారు.

ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అవని ఆరోపణలు ఖండించారు అధికారులు. ఆమె వ్యక్తిగత కారణవల్ల డయాస్ వెళ్లిపోయారని చెప్పారు. ఆస్ట్రేలియాలో మరో జాబ్ ఆఫర్ కోసం ఆమె వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు.



Next Story