- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనీసం కార్పొరేటర్ టికెటైనా ఇవ్వండి !
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆ లీడర్ పరిస్థితి. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన ఓ అగ్రనేతతో సత్సంబంధాలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇప్పటికీ పరిచయాలు ఉన్నా ఎలాంటి ఎదుగూ బొదుగూ లేదు. మరి.. ఈమధ్య పార్టీలో జాయిన్ అయ్యాడా అంటే అదీ లేదు. 2001 నుంచే గోషామహల్ టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అదృష్టం వరించలేదు. అయితే అప్పటిరకు టికెట్ […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆ లీడర్ పరిస్థితి. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన ఓ అగ్రనేతతో సత్సంబంధాలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇప్పటికీ పరిచయాలు ఉన్నా ఎలాంటి ఎదుగూ బొదుగూ లేదు. మరి.. ఈమధ్య పార్టీలో జాయిన్ అయ్యాడా అంటే అదీ లేదు. 2001 నుంచే గోషామహల్ టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అదృష్టం వరించలేదు. అయితే అప్పటిరకు టికెట్ తనదేనని కలలు కన్న ఆ నాయకుడికి అధిష్ఠానం మొండిచేయి చూపడంతో ఆవేదనకు గురైన ఓ కార్యకర్త బ్యాంక్ స్ట్రీట్ కాలనీలోని అతని ఆఫీస్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే ఊపుతో వెళ్లిన కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద హంగామా చేసినా ఫలితం దక్కలేదు. అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఆ నాయకుడు పార్టీని మాత్రం వీడలేదు.
ఇదేక్రమంలో నిరుత్సాహంతో ఉన్న ఆ నేతకు కార్పొరేషన్ పదవీ వస్తుందని, కొన్నిరోజుల్లోనే ఆ విషయం వింటారని ప్రచారం జరిగినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అంతేగాక 2018లో సైతం మరోసారి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా మళ్లీ భంగపాటే ఎదురు కావడంతో అనుచరులు మొత్తం తీవ్ర నిరాశలో ఉన్నారు. అన్నా.. పార్టీలో మొదట్నుంచి పనిచేస్తున్నారు.. అయినా మిమ్మల్ని గుర్తించడం లేదని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ నాయకుడు కార్పొరేటర్ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ మిస్ చేసుకున్నందుకు ఈసారి ఎలాగైన కార్పొరేటర్ టికెట్ దక్కించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
అయితే.. గోషామహల్ నియోజకవర్గంలో 6డివిజన్లు ఉండగా ముగ్గురు టీఆర్ఎస్, ఇద్దరు ఎంఐఎం, ఒకరు బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. వీరిలో సిట్టింగ్‌లను మార్చే అవకాశం కన్పించకపోవడం, ఇతర చోట్ల గెలిచే అవకాశాలు లేకపోవడంతో సదరు నాయకుడు మళ్లీ మథన పడుతున్నారు. ఇదంత చూసిన కార్యకర్తలు.. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి చివరకు కార్పొరేటర్ టికెట్ కోసం తమ నాయకుడు వెంపర్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.






